చేస్తున్న పనిలోనే ఆనందం
ఆనందం కోసం ఏ పని చేయకూడదు. చేస్తున్న పనిని అంటే విధి నిర్వహణను విడిచి పెట్టకూడదు. చేస్తున్న పనిలోనే ఆనందం అనుభవించాలి. ఆ పని ద్వారా ఉన్నత చేతనను అందుకోవాలి. రాజ్యాలను పాలించడమే గొప్ప అనీ, చెప్పులు కుట్టడం, పాత్రలు శుద్దిచేయడం, బట్టలు శుభ్రం చేయడం చిన్న పని కాదు. ఏ పనినైనా సమంగా చూడగలగాలి. 'సమత్వం యోగ ఉచ్చతే' అనీ కదా గీతాచార్యుడు చెప్పింది. అందుకే ఏమి చేస్తున్నవనేది ముఖ్యం కాదు. ఏ భావం తో చేస్తున్నవనేది ముఖ్యం. మన జీవితానికి అంతరాత్మ సారధ్యం వహించాలంటే వీటన్నిటిని పాటించి తీరాలి.
జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి.
లక్ష్యంలేని జీవితం నిరర్ధక జీవితం. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నీ జీవితం కూడా అంట విలువ గలది అవుతుంది. ఆ ఉన్నత లక్ష్యం పరిధిలోనే నీ జీవితం అల్లుకుపోయి ఉండాలి. నీ లక్ష్యం దివ్య జీవితమే అయితే ఇంతకన్నా కావలిసింది ఇంకేముంటుంది! నీ మనః ప్రాణ శరీరాదులలోని స్పందనలన్ని ఆ లక్ష్యం దిశగానే ఉండాలి. దానిని చేరుకోవడంలో ఎన్ని అవరోధాలు , ఆటంకాలు ఉన్న ధైర్యంగా ఎదుర్కోవాలి.
No comments:
Post a Comment